కోరుట్ల, డిసెంబర్ 4 (మానేరు జనత ) : కోరుట్ల గడ్డపై గులాబీ జెండా మరొక్క సారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాజ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ భారీ మెజారిటీతో గెలిచారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని విఆర్ కే కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు మెజారిటీ తగ్గకుండా బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ పై10305 వేల ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ప్రతి గ్రామం నుండి పాత కొత్త కార్యకర్త అనే తేడా లేకుండా సమన్వయం చేసుకుంటూ ప్రతి గడప-గడపకు చేరుకున్నారు. కోరుట్ల గడ్డపై 4వ సారి బీఅర్ఎస్ పార్టీ గెలిచింది. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు . డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపి ధర్మపురి అరవింద్ 61810 ఓట్లతో రెండవ స్థానంలో నిలవగా జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి 39647 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచింది.