- కాంగ్రెస్ శ్రేణుల హర్షకేతనం
- రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరుస్తారా?
జనతా న్యూస్, బెజంకి: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయడంతో బెజ్జంకి మండలంలోని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి ఇచ్చిన మామీని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా చర్చించుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూరు నియోజకవర్గంలోని గుండ్లపల్లి లో జరిగిన సభలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ లో కలుపుతానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరుతుందని అంటున్నారు. బెజ్జంకి మండలంను కరీంనగర్ లో కలపడం ద్వారా ముఖ్యంగా బేగంపేట ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపత్యంలోనే బేగంపేట ప్రజానీకం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆదరించారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ హామిని నెరవేర్చడానికి నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ ఏ మేరకు కృషి చేస్తాడో చూడాలి.