- చేసిన అభివృద్దితో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం
- ప్రత్యర్థుల ప్రచారాన్ని పట్టించుకోని ప్రజలు
- సిరిసిల్ల, జనతా న్యూస్: సిరిసిల్లలో మరోసారి ఇప్పటికే మూడు సార్లు కెటిఆర్‌పై పోటీ చేసి పరాజయం పాలైన కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నా… ఓటమి తప్పించుకోలేరక పోయారు. కెటిఆర్ ఇక్కడ మరోమారు విజయం సాధించారు. ప్తర్యర్థులు ఎలా ప్రచారం చేసినా ప్రజలు కెటిరాª`ª`కే పట్టం కట్టారు. దీనికి గతంలో చేపట్టిన అనేకానేక అభివృద్ది కార్యక్రామలు కూడా దోహద పడ్డాయి. బిజెపి అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన రాణి రుద్రమారెడ్డి బరిలో నిలవగా, బిఎస్‌పి నుండి పిట్టల భూమేష్ పోటీ చేసినా కెటిఆర్ గెలుపును ఆపలేకపోయారు. స్వతంత్రులుగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్, పత్తిపాక సురేష్ సహా 21 మంది సిరిసిల్ల బరిలో నిలుచుండగా కెటిఆర్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ కెటిఆర్ గట్టిగా ప్రయత్నించి గెలుపొందారు. మెజార్టీ తగ్గినా కెటిఆర్ తనకు తిరుగులేదనిపించుకున్నారు. సిరిసిల్ల నుంచి శాసన సభకు ఇప్పటికే నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన మంత్రి కెటిఆర్‌ను ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. మంత్రి కెటిఆర్ సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటల్లో ఆత్మీయ యువ సమ్మేళనాలు, సిరిసిల్ల, గంభీరావుపేట, వీర్నపెల్లి, ఎల్లారెడ్డిపేటల్లో రోడ్‌షోలు నిర్వహించి ప్రచార బరిలో ముందున్నారు.
- సిరిసిల్ల నియోజక వర్గంనుండి మొదటి సారిగా మంత్రి కెటిఆర్ 2009లో పోటీ చేశారు. మొదటి సారి పోటీ చేసినప్పుడు పోలైన ఓట్లలో26.9 శాతం (36,783) ఓట్లు సాధించి ప్రత్యర్థి అయిన కెకె మహేందర్ రెడ్డిపైన కేవలం 0.01 శాతం (171 ఓట్ల) తో విజయం సాధించి గెలిచాననుకొనే అతి సాధారణ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రజలతో మమేకమై తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరిస్తూ 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మెజార్టీని కొంత మెరుగు పర్చుకున్నారు. 2014లో మెజార్టీని మరింతగా అభివృధ్ధి పర్చుకున్నారు. 2018లో నాలుగో సారి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1,25,213 (70.89 శాతం) సాధించి చిరకాల ప్రత్యర్థి కొండెం కరుణ మహేందర్ రెడ్డిపై 88,601 ఓట్ల ఆధిక్యాన్ని కనపరిచారు. మంత్రి కెటిఆర్ ఎప్పటి కప్పుడు తన మెజార్టీని పెంచుకుంటూనే పోతుండటం విశేషం. వెలమ కులస్థులకు పెట్టని కోటగా మారిన సిరిసిల్ల నియోజక వర్గం చరిత్రలో చెన్నమనేని రాజేశ్వరరావు ఐదు సార్లు (1967, 1978, 1985, 1994, 2004) శాసన సభ్యుడిగా గెలుపొందినా ఆయన వరుసగా ఎప్పుడూ రెండో సారి గెలువక పోవడం గమనార్హం.
సిరిసిల్లలో వరుసగా ఐదోసారి కెటిఆర్ విజయం
- Advertisment -