(మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి. జనతా న్యూస్): ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి ఇదేమిటని అనుకుంటున్నారా…ఇది వేలంపాట అనుకోకండి … ప్రస్తుత శాసన సభ ఎన్నికల సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి. దీనికి సమాధానం దొరకాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఆగాల్సిందే.
నవంబర్ 30న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలిస్తే మొదటిసారిగా గెలిచి ఒకటోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ధీమాతో వున్నారు. ఈయన గత 2009, 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈక్ష్న పరిస్థితి గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా వుందని, వీరికి గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక రెండోసారి ఎవరంటే… బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్..వీరు 2009లో మానకొండూరు నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు అయిన సమయంలో త్రిముఖ పోటీలో విజయం సాధించి ఒకటవ సారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి రెండో సారి ఎమ్మెల్యే కావాలని కలలు గంటున్నారు.
ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెడ తాననే ధీమాతో ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వున్నారు. 2014, 2018 ఎన్నికలలో గెలిచి రెండు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు రసమయి బాలకిషన్. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు రు తెచ్చుకొని ప్రజా సేవకు అంకితం కావాలని చూస్తున్నారు రసమయి .
ఏది ఏమవుతుందో గానీ నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యనే తీవ్ర పోటీ ఉందని ఈ సారి మార్పుతప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనాకు వచ్చారు…కాంగ్రెస్స్ గెలుపు ఖాయమని 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించ పోతున్నారని పలువురు అంచనాలు వేస్తున్నారు. విద్యావంతునిగా డాక్టరుగా వివాదాస్పద వ్యక్తి కాడనే అంశాలు పార్టీ మేనిఫెస్టో లో తెలిపిన ఆరు గ్యారెంటీ లను క్యాడర్ తీసుకెళ్లటం లో సఫలం అయ్యారు. ఇవి అన్ని కవ్వం పెళ్లి కి గేలుపుకు కారణాలు అయ్యాయి అని ఒక అంచనా. ఇక రసమయి తాను నమ్మిన క్యాడర్ ఓట్టేదు పోకడలు క్యాడర్ ఆగడాలు బీ ఆర్ ఎస్ మ్యానిఫెస్టోను ఓటర్లకు చెరవేటంలో విఫలం అయ్యారు అనే వాదన వుంది. ఈ ఉత్కంఠతకు డిసెంబర్ 3న సమాధానాలు దొరుకుతాయి…అంతవరకు మానకొండూరు ప్రజలు వేచి చూడాల్సిందే..