(మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్):మానకోందూర్ నియోజకవర్గ ప్రజలకు తనను గెలిపిస్తే ఏమి చేయనున్నానో స్పష్టంగా తెలుపుతూ బాండ్ పేపర్ రాసి తెలియజేశారు. తాను గెలిచిన ఆరు నెలల లోపే గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు డబులు బీటీ రోడ్డు నిర్మాణం చేస్తానని నియోజకవర్గంలో అత్యధిక హంగులతో సూపర్ స్పెషల్ టి ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని, అన్ని మండలాలలోని ఆసుపత్రులను బలోపేతం చేయనున్నట్లు సమీకృత డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ ఐఐటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకుల ఆర్థిక అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణము మిడ్ మానేర్ లోయర్ మానేర్ డ్యాంలలో మస్త్యా సంపద అభివృద్ధి కోసం చర్యలు చేపట్టి చేపల మార్కెట్ నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం గోదాముల నిర్మాణం ప్రతి మండలంలోని కులవృత్తుల వారికి ప్రోత్సాహం కొత్త రేషన్ కార్డులు ఉచిత హెల్త్ కార్డులు ప్రతి మండలంలో కళ్యాణమండపం నిర్మిస్తున్నట్లు ఆయన రాసిచ్చిన బాండ్ పేపర్లో స్పష్టం చేశారు.
డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తానని బీజేపీ అభ్యర్థి బాండ్ పేపర్
- Advertisment -