- బీసీ సెల్ అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్.
జనతా న్యూస్ బెజ్జంకి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనాల ఐలయ్య ఆధ్వర్యంలో మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ గెలుపు కోసం గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను గూడెం కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ మార్పు రావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని, “ప్రజల ప్రాణాలను నిలబెట్టే ప్రాణదాత (డాక్టర్) మనకు ఎమ్మెల్యేగా గెలవాలని, నటించే నటుడు మనకు ఎమ్మెల్యేగా వద్దు “అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డిహాజరు కావడం జరిగింది.అలాగే గూడెల్లి లక్ష్మణ్, గూడెల్లి ఐలయ్య,మహంకాళి బాబు, బోనాల కొమరయ్య, కేశవరెడ్డి, సంపత్ రెడ్డి, కిష్టారెడ్డి, పైడి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.