- తెలంగాణా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపెల్లి వినోద్ కుమార్
(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్):సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలకు కూలీ పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బి ఆర్ ఎస్ పాలనలో కూలీలు దొరకడం లేదని, ఇతర రాష్ట్రాల నుండి మగవారు వచ్చి వ్యవసాయ పనులు సైతం చేస్తున్నారని, ఇది నిజం కాదాయని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆయన మానకొండూరు మండలంలోని ఊటూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. మండలంలోని ఊటూరు తో పాటు లక్ష్మీపూర్ వేగురుపల్లి ఈదుల గట్టేపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. గత పాలకులలో ఎవరూ కూడా రైతులకు సాయం చేయలేదని రైతుల వద్దనే నాటి పాలకులు డబ్బులు వసూలు చేశారని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతులకే తిరిగి డబ్బులను తిరిగి చెల్లిస్తుంది అని వినోద్ రావు చెప్పుకొచ్చారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని తెలంగాణ గాంధీ కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్నారని ఆయన తేల్చి చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి బి.ఆర్.ఎస్ ను గెలిపిస్తే దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నదని కేసీఆర్ తెలిపారు. మరోసారి బి.ఆర్.ఎస్ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని బిజెపి పెంచిన గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకే ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ గెలిస్తే 6 గ్యారంటీలు ఏమోగానీ ఆరు నెలకు ఒకసారి సీఎం మాత్రం మారక తప్పదని ఇది పక్కా అని ఆయన ఎద్దేవా చేశాడు.