Saturday, September 13, 2025

కేసీఆర్ చెల్లెని కరెన్సీ నోటు:రేవంత్‌ రెడ్డి

  •  పోరాటాల గడ్డ..హుజురాబాద్‌ అడ్డా..
  •  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

హుజూరాబాద్‌, జనతా న్యూస్‌:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చెల్లెని కరెన్సీ నోటు అని చెల్లని కరెన్సీ నోటును జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని టిపిసిసి చీఫ్‌ ఎనుముల రేవంత్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు .గురువారం రోజు కరీంనగర్‌ జిల్లా హుజరాబాద్‌ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ప్రజా విజయభేరి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్‌ రెడ్డి అశేష జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నో బలిదానాలపైన ఏర్పడ్డ తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణగా మారుస్తానంటూ ఉత్తర రాకుమారా ప్రగల్బాలు పలికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చాడని తీవ్రంగా దుయ్యబట్టారు .విద్యార్థుల బలిదానాలను ఆపాలనే సంకల్పంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అలాంటి తెలంగాణలో కెసిఆర్‌ దొరల పాలన సాగిస్తూ నిరుద్యోగులను ,ఉద్యోగులను నయవంచనకు గురి చేస్తూ నీరో చక్రవర్తి లా తయారయ్యాడని ఇకనైనా తెలంగాణ రాష్ట్రంలో సమూల మార్పు రావాలి …. దొరల పాలన పోవాలి అంటే ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు ఏడుసార్లు హుజరాబాద్‌ లో ఎమ్మెల్యే గెలిచిన ఈటెల రాజేందర్‌ ఆత్మగౌరవం పేరిట గెలిచి ప్రజలను నయవంచన గురి చేశాడని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుండి నయా పైసా నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకురాలేని అసమర్ధ నాయకుడని ఈటెలకు చురకాల అంటించారు.

హుజరాబాద్‌ అభివృద్ధిని మరిచి హుజురాబాద్‌ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని కూట్లేరాయి తీయలేనివాడు ఎట్లే రాయి తీస్తా అన్న చందంగా హుజురాబాద్‌ ప్రజలను విడిచి గజ్వేల్‌ లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందని తీవ్రంగా దుయ్యబట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోరాటాల గడ్డగా పేరొందిన హుజురాబాద్‌ నియోజకవర్గం ఎన్నో ఉద్యమాలకు పెట్టింది పేరు .ఇక్కడి మట్టిలో ఎంతోమంది నాయకులు జాతీయ రాజకీయాలను శాసించిన మహోన్నత వ్యక్తులను కలిగిన గడ్డ హుజరాబాద్‌ గడ్డ అని కితాబునిచ్చారు .అలాంటి గడ్డపై కోవర్టులు పోటీ చేయాలని చూస్తున్నారు అలాంటి కోర్టులకు చైతన్యవంతమైన హుజురాబాద్‌ ప్రజలు తమ ఓటు హక్కుతో గట్టి గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు రావా లన్న డిసెంబర్‌ 9 వరకు ఇదే ఉత్సాహం కొనసా గించాలి. హుజూరాబాద్‌ గడ్డ మీద కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయాలని నాతో పాటు కోదండ రామ్‌ ,బాల్మురు వెంకట్‌ లు వచ్చారు .పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం వెంకట్‌ ఇక్కడి అభ్యర్థి నీ గెలిపించాలని వచ్చారు . రాజరికపు పాలన ఉండాలా వద్దా అనే అంశాన్ని తెల్చనున్న ఎన్నికలుఅని ,ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంటే దేశ మాజీ ప్రధాని పి వి జిల్లా అని ఈ ప్రాంత అభివృద్ధి కి పాటు పడ్డ నాయకులు ఎం ఎస్‌ ఆర్‌ చో క్కరావు,ఇతర పార్టీ వ్యక్తి ముద్దసాని దామోదర రెడ్డి లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కానీ దొంగ ఏడ్పులు చేర్చిన ఈటల రాజేందర్‌ ఏమా త్రం అభివృద్ధి చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టారు

  • మచ్చ లేని కుటుంబంనుండి వచ్చిన వ్యక్తి ప్రణవ్‌

కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి గతములో ఎలా అభివృద్ధి జరిగింది అలానే నేను దగ్గరు0డి అభివృద్ధి చేస్తాను .ఈ పదేళ్ల కాలములో రాష్ట్రములో దాదాపు 30 లక్షల మంది నిరుద్యో గులు పెరిగారు.నిరుద్యోగుల బాధలను చూడలేక ప్రభుత్వం మెడలు వంచి బాధ్యులను జైల్‌ కు పంపింది బాల్ముర్‌ వెంకట్‌ అని ,30 లక్షల మంది నిరుద్యోగులు ఈ కురుక్షేత్రము లో ముందు ఉండికే సి అర్‌ ప్రభుత్వాన్ని బొంద పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. మచ్చలేని కుటుంబం నుంచి వచ్చిన వోడితల ప్రణవ బాబుకు ఈనెల 30న జరిగే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరూ తమ ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రేవంత్‌ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో తెజాసా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఎన్‌ఎస్‌ యుఎస్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ బల్మూర్‌ వెంకట్‌ నరసింహారావు ,ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌ఎస్‌ఈఎస్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ మధు యాదవ్‌ ,పీసీసీ కమిటీ మెంబర్‌ దాసరి భూమయ్య ,మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డి ,మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం ,కిసాన్‌ సెల్‌ మాజి అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి ,కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page