(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్)
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గడీల పాలన అంతం కావాలంటే మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన గురువారం తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట టోల్ ప్లాజా ఆవరణలో మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెజ్జంకి మండలాన్ని బలవంతంగా సిద్దిపేటలో కలుపుకున్న బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్లో కలుపుతానని స్పష్టమైన హామీని ఇచ్చారు. ఈ ప్రాంతం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్ అప్పుడేమో నేను కారం మెతుకులు తింటున్న నాకు గోసి గొంగడి తప్ప మరి ఏమి లేదని బుకాయింపు మాటలు చెప్పి ఇప్పుడేమో ఫామ్ హోజ్ నిర్మాణం ధనార్ధనే ధ్యేయంగా పనిచేయడంలోనే నిమగ్నమై ఉన్నారని, ఇప్పటికైనా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రాంత సమస్యలు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని మండలానికి జూనియర్ కళాశాల నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల 30 పడగల ఆసుపత్రి ఏర్పాటు హామీలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు మానకొండూరు నియోజకవర్గ ప్రజల బాధలు పోవాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఇది ప్రజలందరూ గుర్తించాలని ఆయన తెలిపారు. తోటపల్లి మిడ్ మానేరు ముంపు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు 24 గంటలపాటు కరెంటు రాదని ప్రచారం చేయడం సరికాదని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 24 గంటల మెరుగైన కరెంటుతో పాటు ఉచితంగా అందిస్తామని తెలిపారు.హాజరైన వారందరి చేత మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని బాయ్ బాయ్ కెసిఆర్ అని అనిపించి సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో రమణారెడ్డి దేవేందర్ రెడ్డి దామోదర్ రత్నాకర్ రెడ్డి అనంతరెడ్డిగుడిసె ఐలయ్య ఆనంద్ రెడ్డి రాఘవరెడ్డి భాస్కర్ రెడ్డి పులి కృష్ణ మానాల రవి డివి రావు కత్తి రమేష్ రావుల నరసయ్య అక్కరావెని పోచయ్య షణగొంద శ్రవణ్ శరత్ మహంకాళి ప్రవీణ్ జేరిపోతుల మధు తదితరులు పాల్గొన్నారు