(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి, జనత న్యూస్):భారత రాష్ట్ర సమితి గెలుపును ఖాయమైపోయిందని, దానిని ఎవరు ఆపలేరని, కాంగ్రెస్ బీజెపి ల హామీలను ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆయన గురువారం మానకొండూరు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ పదేళ్ల పాలనలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని పలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో ఉందని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నోచుకోలేదని మళ్లీ కాంగ్రెస్ ను గెలిపిస్తే అంతే సంగతులు అని అభివృద్ధి జరగాలంటే బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే రావాలని ఆయన తెలియజేశారు. మానకొండూరులో రసమయి బాలకిషన్ ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాళశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని, 24 గంటల కరెంటు సరఫరాతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. అంతకుముందు మహమూద్ అలీ సమక్షంలో గట్టుదుద్దనపల్లి గ్రామానికి చెందిన పలువురు ఇతర పార్టీలవారుచెందిన బిఆర్ఎస్ లో చేరగ వారికి ఆయన గులాబీ కండువా కప్పి బీ ఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు జెడ్పిటిసి శేఖర్ గౌడ్ మానకొండూర్ లకితాపూర్ గట్టుదుదేనపల్లీ సర్పంచ్ లు రొడ్డ పృథ్వీరాజ్ మర్రి కొండయ్య దేవ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్,బీజేపీ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు : హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
- Advertisment -