Saturday, September 13, 2025

బెజ్జంకి మండలంలో జోరుగా పార్టీ ఫిరాయింపులు

(మనకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్ )

ఎన్నికలవేళ పార్టీల ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. రాత్రివేళలో పార్టీ మారడం.. తెల్లవారితే సొంతగూటికి చేరుతున్నారు.వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అమరగొండ రాజు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కనగడ్ల్ల తిరుపతి ల సమక్షంలో అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు మండల బీఆర్ఎస్ నేతలు సంతోషంలో మునిగారు. ఏమైందో ఏమో రాజు గురువారం రోజు ఉదయం వేళ బెజ్జంకి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కనిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను బలవంతంగా బీ ఆర్ ఎస్ వారు వారి పార్టీలో చేరాలని ఎమ్మెల్యే సమక్షంలో చేర్చుకున్నారనిఅన్నారు. ఈ మేరకు ఆయన బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిశ రత్నాకర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహంకాళి ప్రవీణ్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రావుల నరసయ్య జేరిపోతుల మధు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page