(బుర్ర భూమేష్) , జనతా న్యూస్ బెజ్జంకి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం పల్లె పల్లెకు కాంగ్రెస్ గడపగడపకు కవ్వంపల్లి అనే కార్యక్రమం ద్వారా బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో యువ నాయకుడు వడ్లూరు బేగంపేట ఎంపీటీసీ స్రవంతి భర్త, పోతు రెడ్డి మధుసూదన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై నిప్పులు చెరిగారు . ప్రజా ఆశీర్వాద సభలో వ్యక్తిగతంగా తనను దూషించినందుకుగాను మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండా అమరేందర్ రెడ్డి, బేగంపేట మాజీ సర్పంచ్ పోతిరెడ్డి వెంకట్ రెడ్డి సిద్దిపేట సిపిఐ జిల్లా నాయకులు, బేగంపేట మాజీ సర్పంచ్ బుర్ర అంజయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ మామిడాల జయరాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ రామ్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి పోతురెడ్డి రాజశేఖర్ రెడ్డి మండల అధికార ప్రతినిధి జనం శంకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బర్ల శంకర్, బుర్ర తిరుపతి గౌడ్, రవి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
రసమయి ని తీవ్ర స్థాయిలో విమర్శించిన మధుసూధన్ రెడ్డి
- Advertisment -