మాజీ ప్రధాని ఇందిరమ్మ కోరుకున్న సుపరిపాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వోడతల ప్రణవ్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలోని లస్మక్క పల్లి ,రెడ్డిపల్లి, శ్రీరాముల పేట, కోర్కల్, నరసింహులపల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన హామీలనీస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయలేకపోయిందని, ఒక్కరికి రేషన్ కార్డు గాని, పెన్షన్ గాని అందించలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలలో కాలంలో యువతీ యువకులకు ఒక్క నోటిఫికేషన్ను కూడా విడుదల చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యకు, యువకుల ఆత్మహత్యలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కారణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను, డిజిటల్ లైబ్రరీలను, స్మాల్ ఇండస్ట్రీస్ ను ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ గాని , ప్రస్తుత ఎమ్మెల్యే గాని అభివృద్ధిని అటకెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి తనను గెలిపించినట్లైతే మీకు అండగా ఉండి మీ కష్టసుఖాలు పాలు పంచుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చింతల శ్యాంసుందర్ రెడ్డి, టి పిసిసి సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి ,అనిల్ రెడ్డి, సుఖాసి యాదగిరి, వడ్డేపల్లి కొమురయ్య, స్వామి, జునూతుల మధుకర్ రెడ్డి, అనిల్ రెడ్డి, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ తొనే సాధ్యం.
- Advertisment -