-దరువు ఎల్లన్న :తెలంగాణ ఉద్యమకారుడు
మానకొండూరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గెలుపు ఖాయం అయిందని ఓటమి భయంతోనే ప్రతిపక్ష పార్టీ వారు ఆడియోలు సృష్టిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు దరువు ఎల్లన్న ఆరోపించారు మానకొండూర్ మండలంలోని బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తిమ్మాపూర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీర్వాద సభలో రసమయి తాను ఒకే వేదికపై ఒకే వేదికపై ఉన్నామని రసమయి గెలుస్తాడని కేసీఆర్ చెప్పటం జీర్ణించుకోలేక కొందరు ఇతర పార్టీ నాయకులు ఫేక్ ఆడియోలు తయారు చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు ఓటమి భయంతోనే ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు సృష్టిస్తున్నారని ఇలాంటి పనులు కుట్రపూరిత రాజకీయాలు ఎవరికైనా మంచిది కాదని ఆయన హితవు చెప్పారు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికైనా గుర్తెరిగి మసులుకోవాలని ఆయన తెలిపారు ఈ విషయమై తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పత్రిక ముఖంగా పోలీసులను కోరారు