-పిఎసిఎస్ డైరెక్టర్ బెజ్జంకి నరేష్ బాబు.
జనతా న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన యువ దళిత నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కావ్వంపెల్లి సత్యనారాయణ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బెజ్జంకి శాఖ డైరెక్టర్ బెజ్జంకి నరేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి అని దళిత జాతిని మోసం చేసి గద్దెనెక్కి మళ్లీ అధికారంలోకి రావడం కోసం మానకొండూర్ దళిత బిడ్డలను మోసం చేసి ఓట్లు దండుకోవడానికి నియోజకవర్గంలో అందరూ దళితులకు దళిత బంధువు అని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తమ పార్టీ కార్యకర్తలకే ఇదివరకు దళిత బంధు ఇచ్చారని తెలంగాణ దళిత సమాజం గుర్తించి రానున్న ఎన్నికలలో సామాన్యుడి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. తనతో పాటు కాంగ్రెస్ పార్టీలో కలిసినటువంటివారు బేగంపేట అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బెజ్జంకి అంజయ్య, జనగాం అంజయ్య, బెజ్జంకి రాజేందర్, బెజ్జంకి ప్రవీణ్ కుమార్, తాండ్ర కృష్ణ బెజ్జంకి కొమురయ్య అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేగంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుండ అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మామిడల జయరాం, మాజీ సర్పంచ్ బుర్ర అంజయ్య, సోమరామిరెడ్డి, కొరివి లక్ష్మణ్, కొరివి కనకయ్య, కొరివి తిరుపతి, గల్ఫ్ సేవా సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, పురుషోత్తం శ్రీనివాస్ గౌడ్, బుర్ర రవి గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి జనగాం శంకర్, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు బర్ల శంకర్, కార్యక్రమ కోఆర్డినేటర్ పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, శీలం నరసయ్య, గండికోట సురేష్, వెన్నం రాజు,ఎల హరీష్, పున్నం రాజేశం, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.