(బూట్ల సూర్య ప్రకాశ్ మానకొండూరు నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్)
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని మనమంతా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నామని పోలీసులంతా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు గుర్తుకు వుంచుకొని బాధ్యతతో పని చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎం శ్వేతా స్పష్టం చేశారు వారు మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెజ్జంకి పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ సిబ్బందికి ఎన్నికల్లో నిర్వహించవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విధివిధానాల గురించి అవగాహన కల్పించారు శాంతియుత వాతావరణం లో ప్రశాంతంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించటానికి అందరూ సమిష్టిగా విధులు నిర్వహించాలన్నారు ఎన్నికల నేపథ్యంలో మీ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయల సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు అందరితో మర్యాదగా మెలగాలని గ్రామాలలో నగదు మద్యం ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు గొడవలు సృష్టించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీస్ కమిషనర్ శ్వేతతో పాటు సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి సిద్దిపేట రూరల్ సిఐ చేరాలు బెజ్జంకి ఎస్సై నరేందర్ రెడ్డి ఉన్నారు