- కవ్వంపల్లి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి రమేష్ గౌడ్
మనకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్
యువత ఉద్యోగ ఉపాధి లేక అష్ట కష్టాలు పడుతున్నారని ఇప్పటికైనా ఒకసారి యువత మేల్కొనవలసిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ప్రభుత్వం యువతకు చేసింది శూన్యమని కవంపల్లి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి రమేష్ గౌడ్ స్పష్టం చేశారు ఆయన సోమవారం బెజ్జంకి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ సర్కార్ యువతకు మొండి చేయి చుపిందని ఉద్యోగాల కల్పనలో విఫలం చెందిందని తిరిగి బి.ఆర్.ఎస్ కు పట్టం కడితే యువత బతుకులు ఆగం అవుతాయని ఇప్పటికైనా ఆలోచించి యువత తాము ఆగం కాకుండా ఉండాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని ఆయన కోరారు. తమ తమ ఇళ్లలోని ముసలి వారికి కాదు ఇచ్చేది పింఛన్లు యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని అది కాంగ్రెస్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికలలో నిరుద్యోగ భృతి అని గులాబీ బాస్ అన్నారు కదా ఏమైందని ప్రష్నిచారు. ఈ సమావేశంలో ఆయనతో పాటుగా బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్ సోషల్ మీడియా ఇంచార్జీలు మానాల రవి, దోనె వెంకటేశ్వరరావు ఎఎంసి మాజీ చైర్మన్ అక్కరవేణి పోచయ్య, బండి పెళ్లి రాజు, రవి,షణగొండ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు