( బూట్ల సూర్య ప్రకాష్, మానకొండుర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్)
బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బోయినిపల్లి రామచందర్ రావు సీనియర్ రాజకీయ ఉద్దండడు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నారు. చందర్రావు 1983లో టిడిపి ఆవిర్భావ సమయంలో యువనేతగా తోటపల్లి గ్రామం నుండి తెలుగు యువతలో చేరి బెజంకి మండల యువత అధ్యక్షునిగా పనిచేశారు. అనంతరం ఆయన మండల టిడిపి కార్యదర్శిగా మండల అధ్యక్షునిగా చాలా కాలం పని చేశారు. తోటపల్లి పక్క గ్రామమైన వీరాపూర్ గ్రామ ఏకగ్రీవ సర్పంచిగా, గ్రామ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. టిడిపి నుండి జడ్పిటిసిగా పోటీ చేసి ఓటమి పొందారు. అనంతరం జిల్లా టిడిపిలో సెక్రటరీగా పని చేశారు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. అలాగే గునుకుల కొండాపూర్ సింగిల్విండో చైర్మన్ గా ఎన్నికైన్నారు. టిడిపి ప్రభావం తగ్గిన తరుణంలో కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండగా తోటపల్లికి చెందిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు చొరవ తీసుకొని గత పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ లో చేరగా,ఆయన సేవలను వినియోగించుకోవడంలో బీ ఆర్ ఎస్ పార్టీ విఫలం చెందింది.
ఆయన బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతోనే నిన్నటి రోజున మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఆయన చేరికతో కాంగ్రెస్కు ఒక సంపూర్ణ రాజకీయ వేత్త దొరికినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన మార్గదర్శకత్వం లోనే కాంగ్రెస్ పార్టీ మండలంలో పనిచేయునున్నట్లు తెలుస్తోంది. ఆయన చేరికతో బిఆర్ఎస్ బిజెపిలలో స్తబ్దంగా ఉన్న పలువురు నేతలు మూడు నాలుగు రోజులలో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా కబడ్డీ క్రీడాకారుడు ఐనా చందర్రావుకు నియోజకవర్గ వ్యాప్తంగా పలు పరిచయాలు ఉన్నాయి. ఆయన చేరికతో బెజ్జంకి మండలంలోని కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ బలం వచ్చిధని
రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు .