- ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ యే…
- బిజెపి అభ్యర్థి హుజురాబాద్ కు సేవ చేస్తారా గజ్వేల్ కా… ?
- నాణ్యమైన విద్య వైద్యానికి ప్రాధాన్యత..
ఇల్లందకుంట, జనతా న్యూస్ : రాష్ట్రంలో నిరుద్యోగులను పెంచిన ఘనత టిఆర్ఎస్ సర్కార్ దేననీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం మండలంలోని వాగోడు రామనపల్లి, మల్యాల, లక్ష్మాజి పల్లి, కనగర్తి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్, రుణమాఫీ, బీసీ బందు ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఒంటరి మహిళలకు పెన్షన్ కూడా సరిగా అందట్లేదు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు అన్నారు. హుజురాబాద్ బిజెపి అభ్యర్థి హుజురాబాద్ కు సేవ చేస్తారా, గజ్వేల్ కు సేవ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 108, ఆరోగ్యశ్రీ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు వైద్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు. కాంగ్రెస్ లక్ష్యం మెరుగైన విద్య మెరుగైన వైద్యం అని ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలను ప్రజలకు చేరేంతవరకు నిర్విరామంగా పని చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో ఉంటాను భరోసా ఇచ్చారు. తాను తన తాత ఆశయాల మేరకు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చానని, ఆస్తులు సంపాదించడం కోసమో, సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడం కోసమో రాలేదని పేర్కొన్నారు. స్వచ్ఛమైన మనసుతో సేవ చేయడానికి వచ్చానని అన్నారు. నిండు మనసుతో ఒక అవకాశం తన కల్పించాలంటూ మీ ఇంట్లో ఒక వ్యక్తి లాగా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగ్లే రామారావు సీనియర్ నాయకులు. పత్తి కృష్ణారెడ్డి గూడెం సారంగపాణి వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు