(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి, జనత న్యూస్)
గత 10 ఏళ్లు గా అధికారంలో ఉండి కూడా స్థానికేతరుడుని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసింది శూన్యం అని, తనపై నమ్మకంతో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపెడతానని, అభివృద్ధియే తన లక్ష్యంగా పనిచేస్తానని మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆయన ఆదివారం మానకొండూరు మండలంలోని గంగిపల్లి కొండపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ప్రజాసేవ చేయడానికి రాజకీయాలకు వచ్చానని అధికారం ఆస్తుల కోసం కాదని స్పష్టం చేశారు . రసమయి నీ గెలిపిస్తే గోసి గొంగడి అంటూ వాటిని వీడి అసెంబ్లీకి వెళ్లి పాటలు పాడడంలోనే నిమగ్నమై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆయన దెప్పి పొడిచారు. నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ అన్నారు ఏమైందని ప్రశ్నించారు . కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు . పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు