జనతా న్యూస్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శనివారం రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని గాలిపెల్లి జవారిపేట చింతలకుంటపల్లి సోమరం పేట వెంకట్రావుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు, మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సిద్ధం వేణు. సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి గాలిపెల్లిసర్పంచ్ మల్లు గారి సుశీల ఇల్లంతకుంట సర్పంచ్ క కొనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు రహీంఖానపేట సర్పంచ్ బిల్లవేని పరుశురాం ఇల్లంతకుంట ఎంపీటీసీ ఓగ్గు నర్సయ్య యాదవ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట మండలంలో రసమయి బాలకిషన్ సుడిగాలి పర్యటన
- Advertisment -