హుజురాబాద్, జనతా న్యూస్: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదని హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రణవ్ బాబు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపేట, సిర్సపల్లి గ్రామాల్లో మాట్లాడుతూ రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ గ్రామంలో ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా? అని ప్రజలను అడిగారు. అలాగే కేజీ టు పీజీ విద్య ప్రవేశపెడతామని కెసిఆర్ చెప్పారని, కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేదన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ చెప్పాడని, కానీ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని గ్రామస్తులను అడిగారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు గ్యారెంటీ పథకాలతో వస్తోందని, తాము అధికారంలోకి వస్తే ఈ పథకాలు కచ్చితంగా ప్రవేశపెడతామని ముందే హామీ ఇస్తున్నామని ఆయన అన్నారు. మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 చెల్లిస్తామని ప్రణవ్ చెప్పారు.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.