హుజూరాబాద్, జనతా న్యూస్:తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓ కూతురు జోరుగా ప్రచారం చేస్తోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వొడితెల సతీష్ కుమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కోసం బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ గెలవాలని కుటుంబ సభ్యులంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన కూతురు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి తన తండ్రిని గెలిపించాలని కోరుతోంది. బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందుని చెబుతోంది. ఈ సందర్భంగా పలువురు ఆమెకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.