మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్:
బెజ్జంకి మండల కేంద్రము లో కాంగ్రెస్ నాయకుడు పింఛను దారుల కాళ్ళు మొక్కుతు వినూత్న ప్రచారం చేస్తున్నారు. బీ ఆర్ ఎస్ పాలనలో యువతకు ఉద్యోగ కల్పన లేదని, అధి కాంగ్రెస్స్ తోనే సాధ్యమని, యువతకు ఉద్యోగాలు కావాలని పింఛను దారుల కాళ్ళు మోక్కుతు కాంగ్రెస్స్ యువ నేత జెల్ల ప్రభాకర్ కోరుతున్నారు. బీ ఆర్ ఎస్ పింఛను దారులను నమ్ముతున్నారని, వారికి అవగాహన కల్పించటం కోసం ఈ ప్రయత్నం అని ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్దులకే గాకుండా అన్నీ వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అందుకు కాంగ్రెస్ పార్టీ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు .