Oberoi Hotels :వ్యాపార దిగ్గజం, ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ చైర్మన్ పృథ్విరాజ్ సింగ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు 94 ఏళ్ల వయసులో ఉన్న మంగళవారం తుదిశ్వాస విడిచారు. తమ ప్రియత నాయకులుడు తనను విడిచి వెళ్లారని గ్రూపులోని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణంతో విదేశీ ఆతిథ్య రంగానికి తీరని లోటు అని పేర్కొంటున్నారు. ఒబెరాయ్ గ్రూప్ 1934లో ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. ప్రస్తుతం దేశాల్లో 32 లగ్జరీ హోటళ్లు, 7 క్రూయిజ్ షిప్స్ ఉన్నాయి. పృథ్వీరాజ్ వ్యాపార రంగంలో రాణించి దేశానికి పేరు తెచ్చినందున ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషన్ తో 2008లో సత్కరించింది. పీఆర్ఎస్ ఒబేరాయ్ దూర దృష్టితో, అంకిత భావతంతో హోటళ్లను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఒబెరాయ్ కంపెనీలో పృథ్వీరాజ్ 32.11 శాతం వాటాను కలిగి ఉన్నారు. సిగరెట్ల వ్యాపారం నుంచి హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆయన ఎంతో ప్రఖ్యాత చెందారు.
Oberoi Hotels : ఒబెరాయ్ హోటల్ అధినేత పృథ్వీరాజ్ మృతి
- Advertisment -