Friday, September 12, 2025

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

  •  కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది..
  •  ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను వివరించాలి
  •  కారు గుర్తుకు ఓటు వేసి సౌమ్యుడు, స్థానికుడు రవిశంకర్ ను గెలిపించాలి
  •  బీఆర్ఎస్ వారియర్స్ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్

కరీంనగర్ బ్యూరో, జనతా న్యూస్: కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి,కొడిమ్యాల, మల్యాల మండలాలకు సంబంధించిన బూత్ కమిటీ సభ్యులతో సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు.

వైద్య విద్యలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులే అందుకు నిదర్శనమని చెప్పారు. నేటి కాలంలో లక్షలు పోసినా దొరకని సీట్లు తెలంగాణలో అందరికీ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పేదింటి బిడ్డలు కూడా ఎంబీబీఎస్‌ చదివి డాక్టర్‌ పట్టా పొందే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని అన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో కూడా సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి ఉంటున్నాయన్నారు. రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్‌ ఉండడం వల్లే ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు.దళితులు పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి దళిత బిడ్డలు చదువుకునేందుకు ప్రభుత్వం తరఫున ప్రతి విద్యార్థి పై లక్షా 25 వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి విదేశాల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడం గర్వకారణమన్నారు. దళిత బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ లుగా, సివిల్స్లో ఉద్యోగం సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తోందన్నారు.

ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని, కారు గుర్తుకు ఓటు వేసి సౌమ్యుడు, స్థానికుడు రవిశంకర్ ను గెలిపించాలని కోరారు. నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని, అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉన్న మేనిఫెస్టో, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రైతులను,మహిళలను ,అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page