Saturday, July 5, 2025

పాపం.. నాంపల్లి మృతుల్లో 4రోజుల పసికందు

హైదరాబాద్, జనతా న్యూస్ :హైదరాబాద్ లోని నాంపల్లిలో ఘోరం జరిగింది. బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో 7గురు మృతిచెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో 4 రోజుల కిందట జన్మించిన పాప ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భవన నిర్మాణ కార్మికులకు చెందిన ఈ పాపతో పాటు తల్లి కూడా మృతి చెందినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page