Wednesday, September 10, 2025

బీజేపీకి తుల ఉమ రాజీనామా.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన..

కరీంనగర్, జనతా న్యూస్: భారతీయ జనతా పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ నియెజకవర్గ టిక్కెట్లలో భాగంగా ముందుగా వేములవాడ టికెట్ ను కేటాయించారు. ఆ తరువాత భీ ఫాంను వికాస్ రావుకు ఇచ్చారు. దీంతో ఆమె మనస్తాపం చెంది పార్టీపై పలు ఆరోపణలు చేసింది. ఆ తరువాత మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమెను తమ పార్టీలో చేరాలంటే కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ స్వయంగా తుల ఉమ ఇంటికి వెళ్లారు. అయితే ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్తుందన్న ప్రచారం సాగింది. ఈ సందర్భంగా ఆమె ఆదివారం తాను ఏ పార్టలో చేరడం లేదని తెలిపింది. ఇంతలో బీజేపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే తుల ఉమ బీజేపీ టికెట్ వస్తుందన్న ఆశతో నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇతర పార్టీలోకి వెళ్తుందా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page