వరంగల్, జనతా న్యూస్: శాసనసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఏర్పాట్లను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్యఆర్ ఓలు షేక్ రిజవ్వాన్ బాషా, అశ్విని తానాజీ వాఖెడే లతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లోని అన్ని బ్లాకుల గదులను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లకు గాను గదుల విస్తీర్ణాన్ని పరిశీలించారు. పోలింగ్ అనంతరం నియోజకవర్గాల వారీగా ఈవీఎం లు భద్రపర్చడానికి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లు పక్కపక్కనే ఉండేలా చూడాలన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేయాలని, ఏ విధంగా అమరిస్తే సౌకర్యంగా ఉంటుందో పక్కా ప్రణాళిక చేయాలన్నారు. కేంద్ర ఏర్పాటు ప్రక్రియలో భద్రతా తదితర అన్ని చర్యలు పకడ్బందీగా ఉండేట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమష్టిగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కౌంటింగ్ లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను ఆర్వోలు సమీక్షించుకోవాలని, కౌంటింగ్ కొరకు కౌంటింగ్ సిబ్బంది, ఎజెంట్స్, ప్రేవేశం, బయటకు వెళ్లేదారి వేర్వేరుగా బ్యారిగేట్లతో ఉండాలని, అదే విదంగా ఎన్నికల భద్రత, విద్యుత్, వి.ఐ.పి పార్కింగ్, పోలింగ్ ఏజెంట్లుకు కావాల్సిన నీటి, టాయ్లెట్ల సౌకర్యం, పార్కింగ్ లలో ఏటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల , ప్రాంతాలలో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల సామగ్రి గది , ఈవీఎం కమిషన్ హాల్, కమ్యూనికేషన్ గది, అబ్జార్వర్ల గది, మిడియా సెంటర్ ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్, ఆర్డీఓ వాసు చంద్ర, ఎన్నికల అధికారులు,పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.