బెజ్జంకి, జనతా న్యూస్ : మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన అనుచరులతో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. , కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. బెజ్జంకి మండలంలోని నరసింహులపల్లి, చిలాపూర్, గూడెం, వీరాపూర్, తోటపెల్లి గ్రామాలలో కవ్వంపల్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలలో వివిధ పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ కాంగ్రెస్ యువ నాయకులు పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, చిట్టి రాజు, జెల్ల ప్రభాకర్, శనగండశ్రావణ్,శరత్, అక్కర వేణి పోచయ్య, బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ అమరేందర్ రెడ్డి, శీలం నరసయ్య, బుర్ర తిరుపతిగౌడ్, బర్ల శంకర్, గండికోట సురేష్ దితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
- Advertisment -