(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి)రా ష్ట్రంలో రానున్నది కాంగ్రెస్స్ ప్రభుత్వమే నని త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మనకోందూరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లీ సత్య నారాయణ అన్నారు. ఆయన శనివారం రాత్రి బెజ్జంకి మండలం లోని తోటపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని ప్రసంగించారు. ఆయనకు గ్రామం లోని పలువురు యువకులు వృద్దులు ముఖ్యంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు ఆయన మనకొండూరు మండలం లోని అన్నారం, లలితాపూర్, దేవంపల్లీ, కెల్లెడ, పోచంపల్లి, బేజ్జంకి మండలం లోని గూడెం, లక్ష్మిపూర్, వీరపూరు, తోటపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఆగిపోయిన వృద్ధాప్య పింఛన్లు, 104 సేవలు, అన్ని పింఛన్లు ఒకటవ తేదీన కాంగ్రెస్స్ ఇస్తుందని చెప్పుకొన్నారు. ఇన్ని రోజులుగా బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే వుందని అప్పుడు ఐదు వందలకు ఇవ్వలేని వారు ఇప్పెడెల ఇస్తారో వారికే తెలియాలి అన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన కాంగ్రెస్స్ వల్లనే అవుతుందని అన్నారు. ఆయనతో పాటు బ్లాక్ కాంగ్రెస్స్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు ముక్కీసా రత్నాకర్ రెడ్డి, మానాల రవి, దోనే వెంకటేశ్వర రావు, కత్తి రమేష్, చిలివెరు శ్రీనివాస్ రెడ్డి, చేన్నారెడ్డి శ్రవణ్ లింగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తాం: కవ్వంపెల్లి
- Advertisment -