మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల్లో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీలు టిక్కెట్లు కేటాయించిన నేపథ్యంలో కొందరు పార్టీలు మారుతున్నారు. ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకులు, సాయంత్రం వరకు మరో పార్టీలోకి మారుతున్నారు.తాజాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మానకొండూర్ నియోజకవర్గంలోని జేరిపోతు మధు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లోకి మారారు. ఆయన ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో కొనసాగారు. మానకొండూర్ కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తమకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్యాయం చేశారని అన్నారు. ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంతోనే కాంగ్రెస్ కండువా కప్పుుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తమకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే సరైన న్యాయం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన ఉద్యమకారుడు
- Advertisment -