,జనతా న్యూస్:కరీంనగర్ కమీషనరేట్ లోగల గంగాధర, రామడుగు పోలీస్ స్టేషన్ ల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల నేరస్తుల, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలనీ, ఉల్లంఘిస్తే బౌండ్ డౌన్ చేసి పూచికత్తు సొమ్ము మొత్తాన్ని జప్తు చేయాల్సి వస్తుందని మరియు జైలు శిక్షకూడా విధించబడుతుందని వారికి తెలపాలన్నారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని,
అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నియమావాళిని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పక్కాగా అమలు పరచాలన్నారు.ఈ కార్యక్రమంలో రామడుగు ఎస్సై అభిలాష్ , చొప్పదండి ఇన్స్పెక్టర్ గోపతి రవీందర్ తో పాటు, ఎస్సై తోట తిరుపతి మరియు సిబ్బంది పాల్గొన్నారు.