Mumbai Road Accident : టోల్ ప్లాజా వద్ద నిలిచిన ఉన్న కార్లపై మరో కారు దూసుకొచ్చింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముంబైలోని వర్లీ నుంచి బంద్రా వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారు… గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. బాంద్రాలోని టోల్ ప్లాజా వద్ద నిలిపి ఉన్న కార్లపై దూసుకెళ్లింది.తొలుత మెర్సిడేస్ బెంజ్ కారును ఢీకొట్టగా.. ఆ తరువాత మరికొన్ని కార్లపై దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆ ప్రాంత డీసీపీ కృష్ణ కాంత్ తెలిపారు.
నిలిచిన ఉన్న కార్లపై దూసుకొచ్చిన మరో కారు ..ముగ్గురు మృతి
- Advertisment -