Telangana Elections Nomination :హైదరాబాద్, జనత న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషనల పర్వ పూర్తి కానుంది. నవంబర్ 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్లు 10వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు మాత్రమే నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తారు. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితాను గురువారం 8 మందినే ప్రకటించారు. మరో ముగ్గురు పేర్ల ను వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులను గురువారం ఫైనల్ చేశారు. వీరిలో కొందరి ముందే అభ్యర్థులను ప్రకటించినా చివరి నిమిషంలో మార్చారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లు పూర్తయిన తరువాత 13వ తేదీ నాటికి స్క్రూటీ ఉంటుంది. 15వ తేదీ నాటికి ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు.
Telangana Elections Nomination : నామినేషన్లకు నేడు చివరి రోజు..ఆ రోజు వరకు ఉపసంహరణ
- Advertisment -