- అలక వీడిన బెజ్జంకి సర్పంచ్
- బీఆర్ఎస్ విజయానికి ఆ ఇద్దరి సహకారం తప్పని సరి?
- మరొ కథనం త్వరలో…
(యాంసాని శివకుమార్/ బూట్ల సూర్యప్రకాశ్ )
సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిజానికి నాటి నుంచి నేటి వరకు ప్రాధాన్యం ఎక్కడా తగ్గలేదు. సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించడంలో జర్నలిస్టులు నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఒక వార్తను పేపర్ ద్వారా ప్రజలకు అందించడమే కాకుండా వారిలో చైతన్యాన్ని పించేందుకు జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తారు. అదే సమయంలో రాజకీయాల్లో తమ కలం నైపుణ్యంతో వ్యూహాలను మారుస్తారు. ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లను కదిలిస్తుంది అన్నట్లుగా.. చిన్న వార్తల రాజకీయ నాయకుల గుండెల్లో దడ పుట్టిస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతోంది. ఈ తరుణంలో జర్నలిజంలోకి సాంకేతికత చొచ్చుుకు వచ్చింది. అయితే పేపర్ ద్వారా కాకుండా డిజిటల్ మీడియా ద్వారా న్యూస్ చదవడానికే అలవాటు పడుతున్నారు. దీంతో పెద్ద పత్రికలు తమ పంథాను మార్చుకుంటున్నాయి.
-
రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు ..
ఇలాంటి సమయంలో పెద్దపత్రికలకు దీటుగా కొన్ని చిన్న పత్రికలు జర్నలిజంలో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ధీటైన జర్నలిస్టులు పెద్ద పత్రికల్లోనే కాదు చిన్న పత్రికల్లోనూ ఉంటారని నిరూపిస్తున్నారు. తాజాగా ‘మానేరు జనతా’లో వచ్చిన ఓ న్యూస్ అందుకు నిదర్శనం. బెజ్జంకి మండలంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై కథనాన్ని ప్రచురించింది. అక్కడి రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చెప్పింది. దీంతో ఏకంగా మంత్రి హరీష్ రావు ఈ కథనంపై స్పందించడం విశేషం. ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయన వెంటనే బెజ్జంకి గ్రామానికి తన అనుచరులను పంపించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
-
నేతల మధ్య యుద్ధం కొరకరాని కొయ్యలా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి రెండుసార్లు అధికారం చేపట్టి హ్యాట్రిక్ లక్ష్యంతో దూసుకెళ్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు ఏ స్థాయిలో వారు లీడర్లు పార్టీ గెలుపు కోసం తమ శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన మంత్రి హరీశ్ రావు అహర్నిశలు కష్టపడుతూ వస్తున్నారు. ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటీవల మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి అధికార పార్టీలో నేతల మధ్య యుద్ధం కొరకరాని కొయ్యలా తయారైంది. ముఖ్యంగా అక్కడి ఎంపీపీ, సర్పంచ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి దాపురించింది. దీంతో మంత్రి హరీశ్ రావు ఇరువురు నేతలతో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. దీంతో ఇద్దరూ కలిసిపోయి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం పార్టీలోని క్యాడర్‌లో పెద్ద ఎత్తున జోష్ తీసుకొచ్చింది.
-
అసలు జరిగిందేంటీ?
మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపులో బెజ్జంకి ఎంతో కీలకం. అలాంటి సెంటర్ లో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ దంపతులు ధ్యావనపల్లి మంజుల-శ్రీనివాస్ అలకబూనారు. ప్రధానంగా ఎంపీపీ నిర్మలకు వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఎన్నికల వేళ వారు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో పలువురు సర్పంచ్ అనుచరులు ఇటీవల కాంగ్రెస్ గూటికి కూడా వెళ్లిపోయారు.
-
‘మానేరు జనతా’ కథనంపై మంత్రి స్పందన..
ఇదే విషయాన్ని ‘మానేరు జనతా’ పేపర్ లో ‘నివురుగప్పిన నిప్పులా బెజ్జంకిలో రాజకీయం’ అనే కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం బీఆర్ఎస్ అధిష్టానాన్ని కదిలించింది. దీనిపై రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెంటనే వారిని పిలిపించుకొని రహస్య మంతనాలు జరిపారు. ఎంపీపీ, సర్పంచ్ దంపతులతో చర్చించారు. మంత్రి హామీ మేరకు సర్పంచ్ దంపతులు ప్రచారంపర్వంలోకి దిగారు. దీంతో గ్రామంలో గులాబీ దండు ప్రచారంలో మరింత దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ గూటికి చేరిన సర్పంచ్ అనుచరులను తిరిగి సొంత గూటికి చేరుస్తారా లెదా అని తెలియకుండా ఉంది.బెజ్జంకి ప్రచార బాధ్యతలను సైతం సర్పంచ్ కే అప్ప జెప్పినట్లు తెలుస్తుంది.ఒకప్పుడు పెద్ద పేపర్లలో వచ్చే కథనాలనే ప్రామాణికంగా తీసుకున్న పార్టీల నేతలు.. చిన్న,పెద్ద పత్రికల తేడా లేకుండా ప్రస్తుతమైన కథనాల పైననే ఫోకస్ సారిస్తున్నారు. పెద్ద పేపర్లకు దీటుగా కథనాలు వస్తుండడంతో పార్టీలో జరుగుతున్న లోపాలను తెలుసుకుంటున్నారు. దానికి అనుగుణంగా దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు.
బీఆర్ఎస్ విజయ బాట పట్టాలంటే ఆ ఇద్దరు నేతల మద్దతు తప్పని సరేనా?
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ లోని ఇద్దరు ముఖ్య నేతలతోనే ఇన్నాళ్లు మానకొండూరు నియోజకవర్గం లో పార్టీ పటిష్టంగా ఉందన్న వాదన వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరిని పట్టించుకోకపోవడంతోనే పార్టీ అయోమయం లోకి మారిందని మరో మారు టిఆర్ఎస్ విజయబాట కట్టాలంటే ఆ ఇద్దరిని కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరో కథనం త్వరలో….