నామినేషన్ల జోరు గురువారం పెరగనుంది. ఈరోజు మంచిరోజు అని భావించి చాలా మంది నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గజ్వేల్ లో నామినేషన్ వేస్తారు. ఆ తరువాత వెంటనే కామారెడ్డికి వెళ్లి అక్కడ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లు పూర్తయిన తరువాత కామారెడ్డిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో సభ కోసం ఏర్పాట్ల పూర్తి చేశారు.
ఇటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గురువారం నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన గజ్వేల్ లో నామినేషన్ వేశారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం కేసీ క్యాంపు నుంచి హుజూరాబాద్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నేతలు భారీగా ఏర్పాటు చేశారు.
నేడు నామినేషన్ల జోరు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ ఈటల..
- Advertisment -