CM Kcr : ప్రజాస్వామ్య వ్యవస్థలో సేవ చేసే వ్యక్తులకే ఓటు వేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రజా ఆశీర్వాద్ యాత్రలో భాగంగా బుధవారం ఆయన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఓటు వేసే ముందు మంచి చేసే పార్టీ దీ? నష్ట పరిచే పార్టీ ఏదీ అని ఆలోచించాలన్నారు. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని విస్మరించిందన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెలంగాణను తెచచిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని 24 గంటల కరెంట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని అందులో భాగంగానే రైతు బంధు ప్రవేశపెట్టామని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఎంతో మంది సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. అలా చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
CM Kcr :సేవచేసే వ్యక్తులకు ఓటు వేయాలి: సిర్పూర్ కాగజ్ నగర్ లో కేసీఆర్
- Advertisment -