Amith Shah : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో బాగంగా ఆయన మంగళవారం రాజస్తాన్ లోని నగౌర్ జిల్లాకు వెళ్లారు. బిడియాడ్ గ్రామం నుంచి పర్బత్ గ్రామానికి వెళ్తుండగా.. ఆయన కారు విద్యుత్ తీగలకు తగిలింది. అయితే విద్యుత్ తీగలు తగిలిన వెంటనే అవి మంటలు లేచి తెగిపోయాయి. దీంతో అమిత్ షా వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమై వెనుకాల వస్తున్న కాన్వాయ్ ని ఆపేశారు. లేకుంటే పెను ప్రమాదమే జరిగేది. ఆ తరువాత అమిత్ షా మరో వాహనంలో వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా రాజస్థాన్ లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన అక్కడికి ప్రచారానికి వెళ్లారు.
Amith Shah : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తప్పిన ప్రమాదం
- Advertisment -