కరీంనగర్, జనతా న్యూస్: బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితులకు మించి ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆయనపై ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు సరైన ఆధారాలు లేని కారణంగా ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీంతో మంత్రి గంగుల కమలాకర్ అనుచరులు, బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పిటిషన్ వేశారు. దానిపై ఈనెల 9న విచారణ జరగనుంది.
మంత్రి గంగులపై వేసిన పిటిషన్ కొట్టివేత
- Advertisment -