Ayodhya Templa: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిరం ఆలయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఒకేసారి 15 వేల మంది భక్తులు బస చేసేందుకు వీలుగా టెంట్ సిటీని ఏర్పాటు చేసినట్లు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. శ్రీరామ జన్మస్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ టెంట్ సిటీ ఉంటుందని తెలిపారు. చలికి భక్తులు ఇబ్బందులు పడకుంనే నేటపై ప్రత్యేకంగా ఫ్లైవుడ్ ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే కార్పెట్లు, పరుపులను అందుబాటులో ఉంచుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 24న మహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్నీ ఏర్పాటు పూర్తి చేశారు.
Ayodhya Temple: అయోధ్య అద్భుతం.. ఒకేసారి 15వేల మంది బస చేయొచ్చు..
- Advertisment -