- *నగరంలో పలుచోట్ల నాఖాబంది నిర్వహించిన కరీంనగర్ పోలీసులు.*
- *సరైన నెంబర్ ప్లేట్ మరియు ధ్రువపత్రాలులేని పలు వాహనాలు సీజ్.*
కరీంనగర్ క్రైమ్ జనతా న్యూస్:ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్నందున, కరీంనగర్ కమీషనరేట్ నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. దానిలో భాగంగా సోమవారం రాత్రి కరీంనగర్ లోని వన్ టౌన్, త్రీ టౌన్,ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పలు చోట్ల నాఖాబంది నిర్వహించామన్నారు. కరీంనగర్ వన్ టౌన్ మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించగా 38 ద్విచక్ర వాహనాలు పట్టుబడగా, అందులో 20 ధ్రువపత్రాలు కలిగి ఉండి నెంబర్ ప్లేట్ లేనివని, మిగతా 3 రిజిస్ట్రేషన్ లేని వాహనాలకు ఈ – చలాన్ ద్వారా జరిమానా విధించగా, మిగిలిన 15 వాహనాలల్లో ఒక మద్యం సేవించి వాహనం నడిపగా కేసు నమోదు చేశామని, సరైన ధ్రువపత్రాలతోపాటు నెంబర్ ప్లేట్ కూడా లేని 14 వాహనాలను సీజ్ చేశామన్నారు.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాఖాచౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించగా సరైన నెంబర్ ప్లేట్ మరియు ధ్రువపత్రాలు లేని 9 వాహనాలను సీజ్ చేయగా వాటిలో 7 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను సైతం గుర్తించి, విచారించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించామ్మనారు.రానున్న రోజుల్లో ఈ ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామన్నారు.రాత్రి సమయంలో సరైన కారణం లేకుండా అనవసరంగా తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తనిఖీల నిర్వహణ స్వయంగా పర్యవేక్షించిన అనంతరం మొగ్ధంపూర్ లో ఏర్పాటు చేసిన అంతరజిల్లా చెక్ పోస్ట్ ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేసారు. సిబ్బందిని వాహన తనిఖీల గురించి అడిగి, సంబంధిత రిజిస్టర్ ను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీల్లో అన్నీ శాఖలకు చెందిన ప్రభుత్వ వాహనాలతోపాటు, పేషెంట్ లేని అంబులెన్సులను మరియు అన్నీ పోలీస్ విభాగాల వాహనాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్, ఇన్స్పెక్టర్లు వన్ టౌన్ రవికుమార్, త్రీ టౌన్ శ్రీనివాస్, ఎస్సైలు, స్వామి, ట్రాఫిక్ ఎస్సైలు నీలవేణి రాజు,రాసమళ్ళ సాగర్ లతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.