జనతా న్యూస్ బెజ్జంకి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో మానకొండూర్ బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ అసహనానికి గురై ఓడిపోతానని భయంతో స్థానిక ఎంపీటీసీ భర్త,పోతు రెడ్డి మధుసూదన్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు దిగారని కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండలం అధికార ప్రతినిధి జనగాం శంకర్ ఆరోపించారు.కాంగ్రెస్ శ్రేణులు రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. రసమయి మాట్లాడిన వ్యక్తిగత దూషణలు ఖండిస్తూ మంగళవారం మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బేగంపేట గ్రామంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రసమయి బాలకిషన్ మీరు అత్యున్నతమైనటువంటి గౌరవనీయమైన పదవిలో ఉండి సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన పదవిని నిర్వర్తిస్తూ సంస్కృతిక సారధి చైర్మన్ స్థానంలో ఉండి ఒక వ్యక్తి పట్ల వ్యక్తిగతంగా అసంస్కృతిక పదాలను ఉపయోగిస్తూ మాట్లాడిన తీరు సరైనది కాదని పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి పార్టీ మారాడని ఆరోపిస్తున్నావు! మరి నీ పక్కన ఉన్న మండల నాయకులు అందరూ ఏ పార్టీ నుండి గెలిచారో గుర్తుకు లేదా? ఆఖరికి నీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాడే! ఇతర పార్టీలో గెలిచిన వాళ్లను మీ పార్టీలో కలుపుకున్న నీచ సంస్కృతి మీది మీ కెసిఆర్ మంత్రివర్గంలో ఉన్న ఎందరో మంత్రులు అలా ఉన్నవారే, ప్రచారం చేసుకో నిర్మాణాత్మకమైన విమర్శల ద్వారా ప్రచారాన్ని కొనసాగించు, బెజ్జంకి మండలాన్ని మీ స్వార్థం కోసం సిద్దిపేటలో కలిపారు, బేగంపేట మండలం కాకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ నిజం కాదా, కాంగ్రెస్ బేగంపేటలో అభివృద్ధి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నావు నీ చుట్టూ ఉన్న మా పార్టీ నుండి వచ్చిన మీ నాయకులను అడుగు కాంగ్రెస్ బేగంపేటలో ఏం అభివృద్ధి చేసిందో చెబుతారు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి జనగాం శంకర్,కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి గాదం స్వామి, బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండా అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండలం మాజీ అధ్యక్షుడు చెప్పాల శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు సోమ రామ్ రెడ్డి , మాజీ ఎంపిటిసి మామిడాల జయరాం, మాజీ సర్పంచ్ అంజయ్య గౌడ్, బుర్ర రవి గౌడ్, తుమోజు బ్రహ్మచారి, మేకల కనకయ్య, మానాల రవి, శీలం నర్సయ్య, కోరి లక్ష్మణ్ , నూనె రాజేందర్ రాజు మహేందర్, పత్తి మహేందర్ రెడ్డి ,జెల్ల ప్రభాకర్, బోనగం రాజేశం గౌడ్, అక్కర వెని పోశయ్య, కవ్వంపల్లి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి రమేష్ గౌడ్, రా సూరి మల్లికార్జున్,గండికోట సురేష్, బర్ల శంకర్, మంద శేఖర్ గౌడ్, పులి సంతోష్ గౌడ్, పులి రమేష్ గౌడ్, కాసాని నరసయ్య, కొరివి రాజేందర్, తిరుపతి, సంపత్, వెన్నం రాజు, సంగం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిగత ధూషణలు సరికాదు :కవ్వంపల్లి సత్యనారాయణ
- Advertisment -