హైదరాబాద్, జనతా న్యూస్ : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కంటి శస్త్ర చికిత్స పూర్తయింది. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆయన కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. తనకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసినందుకు చంద్రబాబు వైద్య సిబ్బందితో కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోనే టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఈ ఆపరేషన్ తరువాత వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 4 వారాల పాటు బెయిల్ పై రాజమండ్రి జైలు నుంచి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కంటి శస్త్ర చికిత్స నిర్వహించుకున్నారు.
చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి
- Advertisment -