మంథని, జనతా న్యూస్: మంథని పట్టణంలోని గంగ గోదావరి నది తల్లికి సోమవారం ఘనంగా హారతులు ఇచ్చారు. అశ్వయుజ మాసం దశమి రోజున ఈ హారతులు ఇస్తే సర్వ జనులకు మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్పబడింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కార్యక్రమాలు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వెనుకటి గోదావరి నది తీరాన్ని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఇసుక తిప్పలు కనిపిస్తున్న గోదావరి నది తీరని చూసి భక్తులు వెనుకటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు.
గంగమ్మ తల్లికి ఘన హారతులు
- Advertisment -