హైదరాబాద్, జనతా న్యూస్:అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఈసారి 14 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. అయితే ఇందులో కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. కామారెడ్డి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఎంతో కాలంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పురమల్ల శ్రీనివాస్ పేరు ప్రకటించారు. ఇక సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేకే మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ప్రకటించిన లిస్టులో కొన్ని మార్పులు చేసింది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డి, బోథ్ లో వెన్నెల అశోక్ స్థానంలో గజేందర్ కు టికెట్లను కేటాయించారు. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరెవరెవరంటే?
కామారెడ్డి – రేవంత్ రెడ్డి
కరీనగర్ -పురమల్ల శ్రీనివాస్
చెన్నూర్ (ఎస్సీ) -జీ. వివేకానంద
బోథ్ (ఎస్టీ) -గజేందర్
బాన్సువాడ -ఏనుగు రవీందర్ రెడ్డి
జుక్కల్ (ఎస్సీ) -తోట లక్ష్మీ కాంతారావు
నిజామాబాద్ అర్బన్ -షబ్బీర్ అలీ
సిరిసిల్ల -కొండం కరుణ మహేందర్ రెడ్డి
నారాయణఖేడ్ -సురేష్ కుమార్ షెట్కర్
వనపర్తి -తూడి మేఘా రెడ్డి
పటాన్ చెరు -నీలం మధు ముదిరాజ్
డోర్నకల్ (ఎస్టీ) -రామచంద్రు నాయక్
ఇల్లందు (ఎస్టీ) -కోరం కనుకయ్య
వైరా (ఎస్టీ) -రామదాసు మాలోత్
సత్తుపల్లి(ఎస్సీ) -మట్టా రాగమయి
అశ్వారావుపేట (ఎస్టీ) -జారె ఆదినారాయణ