వచ్చే 24 రోజుల పాటు తమకు పూర్తి సహకారం అందించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. సోమవారం కరీంనగర్ లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడన్నారు. తాము ధర్మం నిలబడేందుకు చావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కరీంనగర్ లో కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు. స్మార్ట్ సిటీ నిధులు, నేషనల్ హైవే నిధులు తానే తీసుకొచ్చానని తెలిపారు. బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. కరీంనగర్ ఫలితాల కోంస తెలంగాణ మొత్తం ఎదురుచూస్తోందని అన్నారు. ఇక్కడ ఒక్కరికైనా రేషన్ కార్డు ఇప్పించారా? అని అన్నారు. గంగుల కమలాకర్ బాధుతల సంఘం ఏర్పడి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ సందర్భంగా గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడారు. తామిద్దరం కాషాయ జెండాను వదిలిపెట్టి పోలేదన్నారు. అంతకుముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా యువకులు పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, జై రామ్ అంటూ నినాదాలు ఇచ్చారు. నగరంలోని బైపాస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ గా వెళ్లి ఆ తరువాత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా నామినేషన్ పత్రాలతో మహాశక్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
24 రోజుల పాటు పూర్తి సహకారం అందించండి : నామినేషన్ తరువాత బండి సంజయ్
- Advertisment -