తిరుపతి, జనతా న్యూస్ : తిరుమలలో సోమవారం భారీ వర్షం కురిసింది.దీంతో శ్రీవారి ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. దర్శనానికి బయట నిల్చున్న భక్తులు తడిసి ముద్దయ్యారు. వర్షం కారణంగా చలి తీవ్రత కూడా పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఆదివారం నుంచి ఈదురుగాలుతో కూడిన భార వర్షం కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మరోసారి భారీ వర్షం కురిసింది. అయితే భక్తలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో 24 సెంటీమీటర్ల ఉష్ణోగ్రత ఉంది.
తిరుమలలో రోడ్లన్నీ జలమయం..
- Advertisment -