జనతా న్యూస్ బెజ్జంకి : మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు గాదం స్వామి నీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గాదం స్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన తనను,తన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు, తన నియమాకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులతో పాటు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ విజయంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా తన వంతు ప్రజలను చైతన్యం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ముందుకు తీసుకెళ్తూ, నిరుద్యోగులకు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరిస్తూ వారిని చైతన్యం చేసుకుంటూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాసూరి మల్లికార్జున్, తిరుపతి రెడ్డి, పులి సంతోష్, మేచినేని మాధవరావు, పులి రమేష్, కాసాని నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.