మహేష్ బాబు నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. క్రేజీ హీరోయిన్ శ్రీలలతో కలిసి మహేష్ నటిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను ఎప్టికప్పుడు చిత్ర బృందం రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దమ్ మసాలా’ అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో ప్రేక్షకులనువిపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక యూట్యూబ్ లో అయితే వ్యూస్ షేక్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రోమోను 1.6 మిలియన్ల మంది వీక్షించారు. దీనికి సంబంధించిన సాంగ్ మంగళవారం రిలీజ్ కానుంది. ప్రోమోనే ఇలా షేక్ చేస్తే.. ఇక సాంగ్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రోమో
- Advertisment -